కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేశారని మంత్రి నారాయణ అన్నారు. శుక్రవారం కొండవీటి వాగును పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాలని, కానీ పూర్తిగా మట్టితో నిండిపోవడం వల్ల నీళ్లు వెనక్కి వచ్చాయని మంత్రి చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇలాంటి దుష్ప్రచారం ప్రజలను నమ్మరని ఆయన పేర్కొన్నారు.