విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి,సిగరెట్,మద్యపానానికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నారాయణ,లంకదాసరి శ్రీనివాస్, అచ్యుత రాజు పాల్గొన్నారు