వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఏఎంసీ ఛైర్మన్ కొండేటి శివ హితవు పలికారు. బుధవారం తణుకు ఏఎంసీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో పనిచేసిన మాజీ ఏఎంసీ ఛైర్మన్ జానకి అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తణుకు ఏఎంసీ నుంచి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.