గుంటూరు - చుట్టుగుంట వీఐపీ మెయిన్ రోడ్డు వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టారు. మంగళవారం మున్సిపల్ అధికారులు డ్రైనేజీ నిర్మాణం చేపట్టడానికి మెయిన్ రోడ్డుపై రాకపోకలను బంద్ చేశారు. డ్రైనేజీలో ఎక్కువగా కూరుకుపోయిన బురద, చెత్తను బయటకు తీసి తొలగించే ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు ప్రజలు పనులు జరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలోహించాలని సూచించారు.