అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని నరసాపురం గ్రామంలో శ్రీరంగాపురం పిహెచ్సి వైద్యాధికారి రవిశంకర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్యాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు వైద్యాధికారి సూచించారు. అనంతరం సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని దోమలు కుట్టకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత డ్రైడేలను పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.