మానేరు రివర్ ఫ్రంట్ పనులపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో భాగంగా నదికి ఇరువైపులా ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుండి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సేకరణ ప్రక్రియ ఏ దశలో ఉందో అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో ఈ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.