బాలికపై అదే ప్రాంతానికిచెందిన ఇద్దరు మైనర్లు అత్యాచారం చేయడం దారుణం అని, ప్రభుత్వం తరఫున సహాయం అందజేసి బాధితురాలకు అండగా ఉంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న పోక్సో కేసు బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 7న సీతమ్మధారలో బాలికపై లైంగిక అత్యాచారం జరిగిందని ఇలాంటి ఘటన జరగడం బాధాకరం, దురదృష్టకరం అన్నారు. దేశంలో మహిళలకు అత్యంత రక్షణ గల ప్రదేశం విశాఖ అని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా అలా చేయాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు.