కనిగిరి పట్టణంలోని సుగుణావతమ్మ సెంటర్ నందు విద్యుత్ అమరవీరుల కు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కేశవరావు మాట్లాడుతూ... 2000 వ సంవత్సరంలో బషీర్బాగ్ లో విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళన చేస్తున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం కాల్పులు జరిపి వారిని అన్యాయంగా చంపిందన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ స్మార్ట్ మీటర్లు ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, నాటి విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ మరో ఉద్యమానికి సిపిఎం పార్టీ శ్రీకారం చుడుతుందన్నారు.