ఆదివారం జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలం మోదంపల్లి గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఒక లేగ దూడ మృతి చెందింది. శనివారం రాత్రి ఆంజనేయులు తన పొలంలో ఆవులను, దూడలను కట్టేసి ఇంటికి వెళ్లగా, ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా కుక్కల దాడిలో లేగ దూడ చనిపోయి కనిపించింది. మూడు నెలల క్రితం ఇదే ప్రదేశంలో కుక్కల దాడిలో నాలుగు మేకలు కూడా మృతి చెందాయని గ్రామస్థులు తెలిపారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని వారు కోరుతున్నారు.