బాపట్ల రైల్వే స్టేషన్ మీదుగా ఎర్నాకులం వెళ్తున్న శబరి ఎక్స్ప్రెస్ ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం సుమారు గంట పాటు రైలును నిలిపివేశారు. ప్రయాణికుల కథనం ప్రకారం, మరో ఇంజన్ తెచ్చి రైలును ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తామని లోకో పైలట్ తెలిపారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఈ సంఘటనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే శాఖ అధికారులు ఇంజన్ ను మార్చేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు.