విజయపురం మండలం విజయపురం క్లస్టర్ రిసోర్స్ సెంటర్ నందు ఉన్నత పాఠశాలకు బాలల మంచి కథలు, విద్యార్థుల కేరిర్ కృత్య పుస్తకం, కేరిర్ గైడెన్స్ టీచర్ హ్యాండ్ బుక్, ప్రాథమిక పాఠశాలకు 1,2 తరగతుల విద్యార్థులకు సంసిద్ధత కార్యక్రమం నిర్వహణ పుస్తకాలు ఏంఈఓ హరిప్రసాద్ సోమవారం పంపిణీ చేశారు. ఈ పుస్తకాలలోని విషయాలను ఉపాధ్యాయులు అవగాహన చేసుకొని విద్యార్థులకు వివరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుమతి, దొరస్వామి, సీఆర్సీ కార్యదర్శి వెంకమరాజు పాల్గొన్నారు.