బాపట్ల జిల్లాలో ఆదివారం పదవీ విరమణ చేసిన ఎస్సై డేవిడ్, హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావులకు ఎస్పి తుషార్ డూడి ఆత్మీయ వీడ్కోలు పలికారు.వారి కుటుంబ సభ్యులతో ఎస్పీ ముచ్చటించారు.పదవీ విరమణ అనంతరం కూడా పోలీసులందరూ ఒకే కుటుంబమని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని వెంటనే వచ్చేటట్లు చూస్తామని, భవిష్యత్తులో కూడా తమ సహాయ సహకారాలు ఉంటాయని ఎస్పీ వారికి భరోసా ఇచ్చారు. ఆ ఇద్దరినీ ఆయన ఘనంగా సన్మానించారు.