మడకశిరలో వైయస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది.శుక్రవారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మడకశిర పర్యటన నేపథ్యంలో అమరాపురం,అగళి మండలాలకు చెందిన వైస్సార్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వీరికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఎమ్మెస్ రాజు చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.