గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి సత్యనారాయణ అధికారులను కోరారు. ఆదివారం పొన్నూరు లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన కురిసిన వర్షానికి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కట్ట తెగి, మురుగు నీరు ట్యాంకులోకి చేరి కలుషితమయ్యాయనే కారణంతో రోజు మార్చి రోజు నీటిని విడుదల చేస్తున్నారని, అయితే ప్రతిరోజూ నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.