క్రీడలు కేవలం వినోదమే కాదనీ, శారీరికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని ఎస్సై సురేష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన తైక్వాండో, కరాటే అకాడమీని జిల్లా తౌకాండ సెక్రటరీ మాస్టర్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు రామారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవితంలో చదువుల భారం పెరిగి క్రీడలకు దూరమవుతున్న సందర్భంలో వాటి ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ అకాడమీ ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.