చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో వినాయక చవితి, వినాయక నిమజ్జనాలు, మిలాద్ ఉన్ నబి పండుగల సందర్భంగా ప్రణాళిక బద్ధంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకునే విధంగా నిరంతరం కృషి చేసిన పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడుకు ఎస్. డి. పి. ఐ. పార్టీ జిల్లా అధ్యక్షులు యూసుఫ్, ఉపాధ్యక్షులు జమీర్ ప్రధాన కార్యదర్శి.యూనుస్, ఏజాస్, బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాబా, చాంద్ భాషా, అతిక్, తదితరులు పాల్గొన్నారు.