విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.మంగళవారం బాలానగర్ మండలంలో ఉడిత్యాల గ్రామం లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను,గుండెడ్ గ్రామంలో పల్లె దవాఖానా ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత జడ్.పి.ఉన్నత పాఠశాలను సమర్థించి పాఠశాల ప్రాంగణమంతా తిరిగి పరిసరాలను పరిశీలించారు. పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం తరగతి గది కి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య పై ఆరా తీశారు.విద్యార్థుల సంఖ్య లో