నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని వేములపూడి బీసీ బాలికల వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతున్న రంగాల హాసిని అనే విద్యార్థిని శుక్రవారం ఉదయం తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.కుమార్తె మృతదేహానికి పోస్టుమార్టం జరిపేందుకు తల్లితండ్రులు నిరాకరిస్తున్నారని రూరల్ పోలీసులు తెలిపారు.