Download Now Banner

This browser does not support the video element.

ఎల్లారెడ్డి: 15 రోజులుగా కామారెడ్డి - ఎల్లారెడ్డి రూట్ లో నడవని బస్సులు.. పనులు వేగవంతం చేయాలి

Yellareddy, Kamareddy | Sep 10, 2025
ఎల్లారెడ్డి : వరద విపత్తు కారణంగా కామారెడ్డి - ఎల్లారెడ్డి మార్గంలో లింగంపల్లి ఖుర్దూ వద్ద వంతెన కొట్టుకుపోయింది. ఈ ఘటనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలికంగా నిర్మించిన వంతెనపై భారీ వాహనాలకు అనుమతి లేకపోవడంతో, కామారెడ్డి-ఎల్లారెడ్డి రూట్లో బస్సులు పోల్కంపేట గేట్ వరకు మాత్రమే నడుస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కామారెడ్డి-గాంధారి-నల్లమడుగు-లింగంపేట్-పిట్లం మార్గంలో రెండు బస్సులు నడుపుతున్నారు. ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేయడంతో పనులు వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us