నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ లో సిపి సాయి చైతన్య IMA ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. ఖలీల్ వాడిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతున్న సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాహనాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నామన్నారు. ఇందులో ప్రధానంగా ట్రాఫిక్,రాంగ్ పార్కింగ్, సెల్లార్ పార్కింగ్ మొదలగు విషయాల గురించి క్షుణ్ణంగా చర్చించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం పెయిడ్ పార్కింగ్ గా ఏర్పాటు చేయనున్నట్లు సిపి పేర్కొన్నారు. అందులో 24 గంటల వరకు కారుకు 50/-,ఆటోకు 30/-, బైకుకు 20/- విధించనున్నట్లు తెలిపారు.