బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా ఉమామహేశ్వర్ నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా ఉన్న తుషార్ డూడీని చిత్తూరు జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. సిఐడి అడ్మిన్ గా ఉన్న ఉమామహేశ్వర్ జిల్లా ఎస్పీ గా రానున్నారు.కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు ఆయన మూడవ ఎస్పి.తొలి ఎస్పీ వకుల్ జిందాల్ కాగా ఆయన బదిలీ అనంతరం తుషారు డూడి బాపట్ల జిల్లా ఎస్పీగా వచ్చారు.