మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంచలనం సృష్టిస్తుంది.. బురుగు గుంపుకు చెందిన మల్లెల నరసయ్య అనే రైతు ఏరియా దొరకకపోవడంతో పంట నష్టం జరిగిందని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. దీంతో స్థానికులు పరిస్థితి విషమించడంతో 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.