తాంసి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ప్రధాన రహదారిపై క్షుద్రపూజల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి.రహదారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి గుడ్డు, నిమ్మకాయ, కుంకుమ, పసుపు ఉంచారు.ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం ఇదే గ్రామంలోని ఆశ్రమ పాఠశాల ఎదుట ఇలాంటి ఆనవాళ్లే కనిపించాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.