సిమెంట్ మిల్లర్ లారీ బోల్తా పడిన ఘటన షాద్నగర్ పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. దూసుకల్ జేపీ దర్గా డబుల్ బెడ్ రూమ్స్ సమీపంలో సిమెంట్ మిల్లర్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.