రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తామని జిల్లా కోపరేటివ్ అధికారి శంకరాచారి అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకదిరా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరియా విషయంలో రైతులు ఎక్కువ ఆందోళన చెందుతున్నారని, రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని వెల్లడించారు.