కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఎల్లమ్మ కుచ్చాలో వీధి శునకాలు బీభత్సం సృష్టించాయి. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసి తీవ్ర గాయపరిచాయి. స్థానికులు గమనించి కుక్కలను వెళ్లగొట్టారు. వెంటనే అతన్ని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఎలమ్మ కుచ్చాలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. వీధి కుక్కల బెడద ఎక్కువైందని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.