నల్గొండ జిల్లా, మాడుగుల పల్లి మండల పరిధిలోని ఆగా మోత్కూరు గ్రామంలో డిఆర్డిఓ ఆదేశాల మేరకు సమ భావన సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫార్మ్స్ కొడుతున్న కేంద్రాన్ని మాడుగులపల్లి సమభావన సంఘాల ఏపిఎం భాషపాక చంద్రశేఖర్ సీసీ నాగయ్యతో కలిసి గురువారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల చివరిలోపు యూనిఫామ్స్ అందజేయాలని సమభావన సంఘాల సభ్యులకు సూచించారు. విద్యార్థుల కొలతలతో నాణ్యతగా కుట్టాలని కోరారు.