తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ చౌరస్తాలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి రజకులు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికి రజకుల సమస్యలు పరిష్కారం కాలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రజకుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.