పెడన పట్టణంలోని ఓ మొబైల్ షాపులో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. తెల్లవారుజామున 4గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు పెడన పట్టణ ప్రధాన రహదారిలో ఉన్న సిరి మొబైల్ షాప్ లోకి చొరబడ్డారు. మొబైల్ షాపులో ఉన్న విలువైన స్మార్ట్ ఫోన్లు, మరమ్మత్తులకు ఇచ్చిన 8 ఫోన్లతో పాటు రూ.5వేలు నగదును చోరీ చేశారు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి గురైన మొబైల్ షాప్ ని సందర్శించారు.