రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర పాలకులు ఘోరంగా విఫలం చెందుతున్నారని ఫలితంగా రైతులు నష్టాల ఊబిలోకి నెట్టివేయబడుతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు ఆరోపించారు.. బుధవారం కొత్తగూడెం సిపిఎం జిల్లా కార్యాలయం శేషగిరి భవన్లో రైతు సంఘం జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు..