పాసుబుక్ మంజూరు చేసేందుకు 20 వేలు రూపాయలు తీసుకుంటుండగా కసింకోట మండలం జెడ్ తుని గ్రామ వీఆర్వోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, నర్సింగబిల్లి గ్రామానికి చెందిన రైతు భూమి పాసుబుక్ మంజూరు చేసేందుకు వీఆర్వో పృథ్వి 40 వేలు డిమాండ్ చేయగా, 20 వేలకు ఒప్పందం చేసుకొని, లంచం ఇవ్వడానికి ఇష్టపడని రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, గురువారం వీఆర్వోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.