మద్దిపాడు: స్కూటీని కారు ఢీకొట్టగా యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మద్దిపాడు మండలం వెంకటరాజు పాలెం వద్ద హైవేపై శుక్రవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు వైపు నుండి వస్తున్న కారు మద్దిపాడు హైవేపై స్కూటీని ఢీ కొట్టి, స్కూటీని ఈడ్చుకుంటూ హైవే పక్కనే ఉన్న గుంతలోకి లాక్కెళ్ళింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు.