రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,వెంకట్రావు పల్లి గ్రామ శివారులో సోమవారం రాత్రి 9 గంటల పది నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది,కరీంనగర్ కు చెందిన సత్యనారాయణ చారి వెంకట్రావుపల్లి వచ్చి తిరిగి తన ద్విచక్ర వాహనంపై కరీంనగర్ కు వెళ్తుండగా,వేములవాడకు చెందిన రాజశేఖర్ తన ద్విచక్ర వాహనంపై వెంకట్రావుపల్లి వెళుతుండగా,ఇరువురు ద్విచక్ర వాహనదారులు ఎదురెదురుగా ఢీకొన్నారు,దీంతో ఇరువురు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి,స్థానికుల సహాయంతో ఇరువురిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు,ఇంకా ఈ ప్రమాణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,