చింతూరు మండలం జాతీయ రహదారి 30 పై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం సాయంత్రం చింతూరు మండలం చట్టి సమీపంలో ఈ సంఘటన జరిగింది.గాయపడ్డ ఇద్దరినీ చింతూరు సామాజిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరిది చింతూరు మండలం ఏడుగురాళ్లు పల్లి కాగా, మరొకరిది మారెడిమిల్లి మండలం మల్లిశాలకు చెందిన వారిగా ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఇక మృతుడు జేబులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ లో జోగా సెల్వం అని ఉన్నట్లు చింతూరు ఎస్సై తెలిపారు