తిరుపతి జిల్లా తడ మండల పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తడ పోలీస్ స్టేషన్ సమీపంలో సూళ్లూరుపేట మండలం కొమ్మినేనిపల్లి గ్రామానికి చెందిన వేలూరు యుగంధర్, అతని భార్య తో కలిసి సూళ్లూరుపేట నుండి వరదయ్యపాలెం టూవీలర్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో తడ పోలీస్ స్టేషన్ వద్ద వెనక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో యుగంధర్ మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొండప్ప నాయుడు తెలియజేశారు.