నవీపేట్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశములో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం నవీపేట అంగడి బజార్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ అంగడి బజార్ లో మొరం వేయడం వల్ల వర్షం పడితే మహిళలకు వృద్ధులకు అంగడికి వచ్చే వారందరికీ అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిసి రోడ్డు ఏర్పాటు చేసి ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.