గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల భద్రతను కాపాడడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరొకసారి తన కర్తవ్య నిబద్ధతను చాటుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గములోని రెడ్డి కాలేజీలో గంజాయి సేవిస్తూ మహిళలు, యువతులను వేధిస్తున్న ఆకతాయిలపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఉక్కుపాదం మోపారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే గళ్ళా మాధవికి స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గళ్ళా మాధవి తక్షణమే స్పందించి, గురువారం స్వయంగా రెడ్డి కాలేజీ వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అక్కడే పోలీసు ఉన్నతాధికారులను పిలిపించి ముగ్గురిని అరెస్ట్ చేపించారు.