ఎమ్మిగనూరు: ప్రశాంత వాతావరణంలో చవితి ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్ఐ..వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నందవరం ఎస్ఐ కేశవ్ అన్నారు. సోమవారం చవితి పందిళ్ల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పోలీసుల నిబంధనల ప్రకారం చవితి పందిళ్లు నిర్వహించాలని, ఎక్కడైనా అల్లర్లు జరిగితే కమిటీ వారిని బాధ్యులను చేస్తామన్నారు. డీజేలు వంటి అనుమతించరాదని, రాత్రి 10 గంటల తరువాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు.