జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథాలపూర్ మండలం కలికోట రోడ్డు నుండి పోతారం లొంక రామన్న తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్లు 30 లక్షల ట్రైబల్ వెల్ఫేర్ నిధులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు శనివారం జారీ చేసింది.ఈ నిధుల మంజూరుతో తండా ప్రజలు, గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఏర్పాటు వల్ల తండాకు వర్షాకాలంలో ఎదురయ్యే రాకపోకల ఇబ్బందులు తొలగిపోనున్నట్లు, గ్రామ అభివృద్ధికి ఇది ఎంతో సహాయపడనుందని వారు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తండాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.