నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ గా కురుస్తున్న వర్షాలు నిపథ్యంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ మేరకు నిజామాబాద్ సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి పరిధిలోని జంగంపల్లి జాతీయ రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సిపి సాయి చైతన్య బుధవారం రాత్రి డిసిపి బసవ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి జంగంపల్లి సరిహద్దు ప్రాంతాలను పరిశీలించారు. పోలీసుల సహకారంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు రోడ్డు పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.