మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్ కు చెందిన రాహుల్ హాస్పిటల్ ను dmho అధికారి తనిఖీలు చేపట్టి ఏమైనా ఇబ్బంది చేస్తే ఊరుకోమని రోగులు రోడ్డుపైకెక్కి నినాదాలు చేశారు. మా డాక్టర్ మాకు కావాలి మా డాక్టర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని రోడ్డుపై రోగులు ఆందోళన చేశారు శుక్రవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్న డిఎంహెచ్వో అన్న ప్రసన్న కుమారి రాహుల్ ఆసుపత్రికి వచ్చినట్లు తెలియడంతో అక్కడికి వచ్చిన రోగులు మా డాక్టర్ను కాపాడుకుంటాం మా ఆస్పత్రిని కాపాడుకుంటామంటూ నినాదాలు చేస్తూ డాక్టర్ కు బాసటగా నిలిచారు.