రాయలసీమ RCM డయాసిస్ ఎయిడెడ్ ఉపాధ్యాయుల పోస్టులో భర్తీలో కడప జిల్లా వ్యాప్తంగా అవకతవకలకు పాల్పడినటువంటి ఆర్సీఎం యాజమాన్యంపై వాటికి సహకరించేటువంటి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోనీ క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నామనీ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల.శివకుమార్ తెలిపారు.బుధవారం నాడు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయంలో ఏడి రామకృష్ణ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఆర్ సి ఎం డయాసిస్ ఎయిడెడ్ స్కూల్లో పోస్టుల భర్తీలో అనేక అవకతవకలు ఉన్నాయని ఉద్యోగం ఒకచోట సంపాదించి మరోచోట ఉద్యోగం చేస్తున్నారన్నారు.