కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పరిధిలోని 728 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని పరిశీలించినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించాలని అధికారులకు ఆదేశించారు. భూములను పక్కాగా హద్దులు నిర్ణయించాలని, అక్రమనలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములలో అనాధికారి కట్టడాలను తొలగించాలని, ఆర్డీవో, తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్, సర్వే ల్యాండ్ అధికారులు, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ భూములను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.