అన్నమయ్య జిల్లా. తంబళ్లపల్లి మండలం కోటకొండ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో కుక్కల పల్లెకు చెందిన రైతు శ్రీనివాసులు రెడ్డి 50 సంవత్సరాలు దుర్మరణం చెందాడు. కొన ఊపిరితో ఉన్న రైతు శ్రీనివాసులు రెడ్డిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఘటనపై తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.