ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన నవీపేట్ లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను, వెటర్నరీ సెంటర్, తహసిల్ ఆఫీసు తదితర కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారిగా సమీక్షించారు.