నరసన్నపేటలో సంచలనం రేపిన బంగారం వ్యాపారి పొట్నూరు గుప్త హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని DSP లక్ష్మణ తెలిపారు. మంగళవారం నరసన్నపేట సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హత్య కేసులో మెల్లి అప్పలరాజు, జవ్వాది సంతోశ్ కుమార్ను అరెస్ట్ చేసామన్నారు. శ్రీకాకుళంలో బంగారం కొనుగోలు చేసిన రఘును అరెస్టు చేయవలసి ఉందన్నారు. వీరి వద్ద నుంచి కేజీ 34 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.