వృద్ధ మహిళపై SI చేయిచేసుకున్న ఘటన వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లో శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. మూసి ఉన్న రెస్టారెంట్లోకి SI వచ్చి గ్యాస్ సిలిండర్ తీస్తుండగా ఎందుకు తీస్తున్నారని నిర్వాహకులు అడిగారు. దీంతో అమర్యాదగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ మహిళపై SI దాడి చేశారు. తనపై కూడా దాడి చేశాడని ఆమె కొడుకు ఆరోపించారు. మిల్స్ కాలనీ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నారు.