బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది.విజయవాడకు చెందిన సాయి అనే యువకుడు సముద్రంలో స్నానం చేస్తూ అలల ఉధృతికి కొట్టుకుపోయాడు.పరిస్థితిని గమనించిన మెరైన్ పోలీసులు,గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లి అతడిని కాపాడడానికి విఫల యత్నం చేశారు.వారు అతడిని చేరేసరికే మృతి చెందాడు.మృతదేహాన్ని వారు ఒడ్డుకు చేర్చారు.కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన బాపట్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.