అనంతపురం నగరంలోని ఐటిఐ మిట్ట వద్ద రైలు కింద పడి మృతి చెందిన మృతుడి ఆచూకీ లభ్యమైందని అనంతపురం రైల్వే ఎస్సై వెంకటేష్ వెల్లడించారు. మృతుడు అనంతపురం నగరంలోని భవానీ నగర్ కు చెందిన బాషూ గా గుర్తించామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించడం జరిగిందని వెల్లడించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని వెల్లడించారు.