పేద ప్రజల పక్షపాతిగా, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నతమైన కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ లో సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రమైన కరువు వస్తే అంబలి కేంద్రాలు ఏర్పాటు కు ఆజ్యం పోశారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి రాష్ట్రాన్ని సాధించడం కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలను, లక్ష్యాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.